Tamilnadu : తమిళనాడులో నేటి నుంచి జల్లికట్లు పోటీలు
తమిళనాడులో నేటి నుంచి జల్లి కట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి;
తమిళనాడులో నేటి నుంచి జల్లి కట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండగకు ముందు జరిగే ఈజల్లికట్టు పోటీలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. జల్లికట్టు పోటీలను వీక్షించేందుకు రాష్ఠ్రం నలుమూలల నుంచి ప్రజలు హాజరు కానున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఈ జల్లికట్టు పోటీలను నిర్వహిస్తుంది. సంప్రదాయంగా భావిస్తుంది.
ఆరువందల ఎద్దులతో...
ఈరోజు పుద్దుకోట్టే జిల్లాలో జల్లితకట్టు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో ఆరు వందల వరకూ ఎద్దులు పాల్గొంటాయి. వాటిని అదుపు చేసేందుకు మూడు వందల మంది యువకులు సిద్ధంగా ఉన్నారు. జల్లి కట్టు పోటీల సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తును అక్కడ నిర్వహిస్తుంది. దీంతో పాటు గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు అవసరమైన ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now