స్థిరంగా బంగారం ధరలు .. స్వల్పంగా పెరిగిన వెండి
గత రెండేళ్లలో 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా రూ.10 వేల నుండి రూ.12 వేల వరకూ పెరిగింది. బులియన్ మార్కెట్లో..
కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ముందు ముందు.. బంగారం ధర సామాన్యుడికి అందుబాటులో ఉంటుందో లేదోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. గత రెండేళ్లలో 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా రూ.10 వేల నుండి రూ.12 వేల వరకూ పెరిగింది. బులియన్ మార్కెట్లో ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. తాజా ధరలను పరిశీలిస్తే.. బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,730 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,960 ఉంది. అలాగే వెండి ధరల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,300 ఉండగా.. విజయవాడలో కిలో వెండి ధర రూ.73,500గా ఉంది.