నేడు హేమంత్ సోరెన్ బలపరీక్ష

నేడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభలో బలాన్ని నిరూపించుకోనున్నారు.

Update: 2022-09-05 03:17 GMT

hemant soren, arrest, enforcement directorate,jharkhand

నేడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభలో బలాన్ని నిరూపించుకోనున్నారు. ఛత్తీస్‌గఢ్ లోని రిసార్టులో క్యాంప్ నుంచి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జార్ఖండ్ కు చేరుకున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సభ్యత్వంపై వేటు పడుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. బీజేపీ జార్ఖండ్ లో తమ పార్టీ ఎమ్మెల్యేలకు వల వేస్తుందని భావించి అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా తన కూటమి ఎమ్మెల్యేలను కొద్ది రోజులుగా క్యాంప్ లో ఉంచారు.

శాసనసభ సభ్యత్వంపై...
హేమంత్ సోరెన్ సొంతంగా తనకు తాను గనులు కేటాయించుకున్నారని ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన సభ్యత్వంపై వేటు పడుతుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని సిఫార్సు వచ్చిందా? లేదా? అన్నది గవర్నర్ చెప్పలేదు. దీంతో బీజేపీ తమ కూటమిలోని ఎమ్మెల్యేలకు వల వేస్తున్నారని అనుమానం వచ్చిన హేమంత్ సోరెన్ ఈరోజు బలపరీక్ష కు దిగారు. జార్ఖండ్ ప్రత్యేక సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.


Tags:    

Similar News