హేమంత్ సోరెన్ కు "ప్రెసిడెంట్" ఫీవర్

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపాలన్న నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు

Update: 2022-06-25 06:46 GMT

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపాలన్న నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. జేఎంఎం యూపీఏలో భాగస్వామిగా ఉంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాల్సి ఉంది. అయితే అధికార పక్షం ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో హేమంత్ సోరెన్ కు మింగుడు పడటం లేదు. ద్రౌపది ముర్ము సంతాలీ గిరిజన తెగకు చెందిన వారు.

వచ్చే ఏడాది ఎన్నికలు...
హేమంత్ సోరెన్ కూడా అదే తెగకు చెందిన వారు. దీంతో పాటు జార్ఖండ్ లో ఎక్కువ మంది గిరిజన ఎమ్మెల్యేలు. ద్రౌపది ముర్ము ఆరేళ్ల పాటు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. గిరిజన తెగకు చెందిన మహిళ తొలిసారి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో మద్దతివ్వాల్సిందేనని హేమంత్ సోరెన్ పై వత్తిడి పెరుగుతోంది. వచ్చే ఏడాది జార్ఖండ్ ఎన్నికలు జరుగుతుండటంతో ఎస్టీ ఓట్లు సోరెన్ కు అవసరం. అందుకే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈరోజు జరిగే యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి జేఎంఎం నేతలు హాజరవుతారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. మరోవైపు సొంత రాష్ట్రమైన ఒడిశాలోని అధికార పార్టీ బిజూ జనతాదళ్ కూడా మద్దతు తెలిపింది. దీంతో హేమంత్ సోరెన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటించాలన్న దానిపై డైలామాలో ఉన్నారని తెలిసింది.


Tags:    

Similar News