భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనజయ యశ్వంత్ చంద్రచూడ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం నియమించారు. నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్న సీజేఐ యూయూ లలిత్ స్థానంలో జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. "In exercise of the powers conferred by clause (2) of Article 124 of the Constitution of India, the President is pleased to appoint Dr Justice Dhananjaya Yeshwant Chandrachud, Judge of the Supreme Court, to be the Chief Justice of India with effect from 9 November, 2022," అంటూ ప్రభుత్వం నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులయ్యారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం ఓ ప్రకటన చేశారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ఆయన అభినందనలు తెలిపారు. నవంబర్ 9న జస్టిస్ ధనజయ యశ్వంత్ చంద్రచూడ్ బాధ్యతలను చేపట్టనున్నారు.