సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్

జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు

Update: 2022-11-09 03:54 GMT

జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా కేంద్రమంత్రులు, ఉప రాష్ట్రపతి తదితర ముఖ్యులు హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

రెండేళ్ల పాటు...
జస్టిస్ డివై చంద్రచూడ్ రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. ఆయన నవంబరు 10వతేదీ 2024న పదవీ విరమణ చేయనున్నారు. రెండేళ్ల పాటు పదవిలో ఉన్న న్యాయమూర్తుల్లో జస్టిస్ చంద్రచూడ్ ఒకరు. జస్టిస్ చంద్రచూడ్ మే 13 2016న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. అంతకు ముందు అదనపు సొలిసిటర్ జనరల్ గా కూడా ఉన్నారు.


Tags:    

Similar News