ఇక 144వ సెక్షన్... హిజాబ్ వివాదమే కారణం
కర్ణాటకలో హిజాబ్ వివాదం సమసి పోలేదు. విద్యాసంస్థల్లో రేగిన వివాదం వీధుల్లోకి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా సమసి పోలేదు. విద్యాసంస్థల్లో రేగిన వివాదం వీధుల్లోకి రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. నిజానికి రేపటి నుంచి కర్ణాటకలో కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నా మరో రెండు రోజులు సెలవులను పొడిగించింది. సోమవారం హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరగనుంది.
మరింత కఠిన చర్యలు....
ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉడిపిలో 144వ సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకూ ఉడిపిలో 144వ సెక్షన్ అమలులో ఉండనుంది. ఉడిపి, చిక్ మంగుళూరు ప్రాంతాల్లోనే ఈ వివాదం ఎక్కువగా కన్పించింది. విద్యాలయాల్లోనూ కఠిన ఆంక్షలను అమలు పర్చాలని కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై భావిస్తున్నారు.