హిజాబ్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హిజాబ్ వద్దు.. కాషాయం వద్దు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. తుది తీర్పు వచ్చేంత వరకూ హిజాబ్ వివాదాన్ని వద్దంటూ పేర్కొంది. జడ్జి కామెంట్లను సోషల్ మీడియాలో పెట్టవద్దని హైకోర్టు పేర్కొంది. హిజాబ్ వివాదాన్ని ఏ విద్యాసంస్థలోనూ తేవద్దని హైకోర్టు పేర్కొంది.
సోమవారం నుంచి....
కర్ణాటకలో సోమవారం నుంచి విద్యాసంస్థలను తెరవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హిజాబ్ వివాదాన్ని తుది తీర్పు వచ్చేంత వరకూ తేవద్దని సూచించింది. ఈ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయాలని కోరింది. విద్యార్థులు విద్యాసంస్థలకు యూనిఫారంలోనే రావాలని పేర్కొంది. అయితే మరోవైపు హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.