ఆ గ్రామాల్లోకి అడుగుపెట్టకూడదు
కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ గడగడలాడిస్తూ ఉంది.
కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ గడగడలాడిస్తూ ఉంది. నిపా వైరస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించిన నేపథ్యంలో కేరళలోని కోజికోడ్‌లో ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించినట్లు కేరళ ప్రభుత్వం బుధవారం తెలిపింది. అంటువ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ఆంక్షలు అమలుచేస్తోంది. ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఆ ప్రాంతాలలో తిరగకుండా చర్యలను తీసుకుంటూ ఉంది.
కోజికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలుడితో సహా మరో నలుగురిలో నాలుగు నిపా కేసుల నిర్ధారణ జరిగింది. దీంతో కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తం అయింది. ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు, కార్యాలయాలను అధికారులు మూసివేశారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ నిపా వైరస్ జాతి బంగ్లాదేశ్ వేరియంట్ అని తెలిపారు. ఇది ఒక మనిషి నుండి మరో మనిషికి వ్యాపిస్తుందని తెలిపారు. అంటువ్యాధి అయినప్పటికీ మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఇంతకుముందు కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ వ్యాప్తి 2018 2021 లో కూడా జరిగింది.