కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు.. ఎందుకంటే

ఒమన్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో అధికారి అయిన ప్రాన్సిస్ కుమారుడు 26 డాక్టర్ ఐవిన్ క్రీడల్లో కూడా చక్కటి ప్రావీణ్యం..

Update: 2023-03-23 07:01 GMT

QR Code on Son's Tomb

కేరళలోని ఓ పెద్ద చర్చి అది. ఆ చర్చిని సందర్శించేందుకు వచ్చినవారు అక్కడున్న ఓ సమాధిపై ఉన్న క్యూఆర్ కోడ్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. సమాధిపై క్యూఆర్ కోడ్ ఉందేంటి ? అని ఆశ్చర్యపోతున్నారు. ఆ తల్లిదండ్రులు ఆ కోడ్ ను ఎందుకు పెట్టారో తెలిశాక భావోద్వేగానికి గురవుతున్నారు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా కురియాచిరా పట్టణంలోని సెయిట్ జోసెఫ్ చర్చికి సంబంధించిన ప్రాంతంలో ఓ సమాధి పలకపై పెద్దసైజులో ఉన్న క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. అది ఓ తండ్రి తన 26 ఏళ్ల కొడుకు ‘గుర్తుకు సజీవం’ సాక్ష్యంగా కనిపిస్తోంది. కొడుకు సజీవంగా లేకపోయినా అతని జ్ఞాపకాలు మాత్రం సజీవంగా ఉండాలన్న ఆలోచనతో ఆ సమాధిపై క్యూఆర్ కోడ్ ను పెట్టారు.

ఒమన్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో అధికారి అయిన ప్రాన్సిస్ కుమారుడు 26 డాక్టర్ ఐవిన్ క్రీడల్లో కూడా చక్కటి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. ఐవిన్ 2021లో బ్యాడ్మింటన్ ఆడుతూ (Dr Ivin Francis) కుప్పకూలి చనిపోయాడు. దీంతో అతని తండ్రి ఫ్రాన్సిస్ తన కుమారుడి జ్ఞాపకాలు సజీవంగా ఉండాలని భావించి డాక్టర్‌ ఐవిన్‌ జీవిత విశేషాలు, అతడి సృజనాత్మక ప్రతిభ తాలూకు వీడియోలు చూసేందుకు వీలుగా ఈ క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేసి దాన్ని డాక్టర్ వెబ్ సైట్ కు అనుసంధానం చేశారు. ఈ క్యూఆర్ కోడ్ కు డాక్టర్‌ ఐవిన్‌ జీవితంలోని ముఖ్య సంఘటనలను ఓ వెబ్‌ పేజీ రూపొందించిన అతడి కుటుంబం క్యూఆర్‌ కోడ్‌తో దాన్ని అనుసంధానం చేసింది. ఈ క్యూఆర్ కోడ్‌ ను స్కాన్‌ చేస్తే ఐవిన్‌ ఫోటోలు, కాలేజీలలో కీబోర్డు, గిటార్లతో ఇచ్చిన ప్రదర్శనలు, అతని స్నేహితుల వివరాలు అన్నీ చూసేలా ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News