మాల్యాకు రేపు శిక్ష ఖరారు

కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం శిక్ష ఖరారు చేయనుంది.

Update: 2022-07-10 04:25 GMT

కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం శిక్ష ఖరారు చేయనుంది. 2017 నాటి కోర్టు థిక్కరణ కేసులో ఈ శిక్షను ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం విజయ్ మాల్యా పరారీలో ఉన్నారు. జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్‌ భట్, పీఎస్ నరసింహలతో కూడిన బెంచ్ రేపు ఈ కేసులో తీర్పును వెలువరించనుంది. ఇప్పటికే ఈ కేసులో వాదనలు ముగిశాయి. మార్చి 10వ తేదీన తీర్పును ధర్మాసనం రిజర్వ్ లో పెట్టారు.

కోర్టు ఆదేశాలను...
కోర్టు ఆదేశాలను థిక్కరించి 10 మిలియన్ డాలర్లను తమ పిల్లల పేరిట విజయ్ మాల్యా బదిలీ చేశారు. ఇది కోర్టు థిక్కరణకు పాల్పడటమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని అనేకసార్లు కోరినా పరారీలో ఉన్న విజయ్ మాల్యా హాజరు కాలేదు. దీంతో రేపు శిక్ష ఖరారు కానుంది.


Tags:    

Similar News