భయంతో వణికిపోయిన ఈశాన్య రాష్ట్రాలు

భారత్ - మయన్మార్ సరిహద్దుల్లో పెద్దయెత్తున భూమి కంపించింది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కు తూర్పున భూకంపం సంభవించింది

Update: 2021-11-26 05:23 GMT

భారత్ - మయన్మార్ సరిహద్దుల్లో పెద్దయెత్తున భూమి కంపించింది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కు తూర్పున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3 గా నమోదయింది. ఈ భూకంపం ప్రభావంతో్ ఈశాన్య రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర, అసోంలలోకూడా భూమి కంపించింది. 30 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తెల్లవారు జామున ఈ భూంకంపం సంభవించింది.

మయన్మార్ - భారత్ సరిహద్దుల్లో....
బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కు తూర్పున 174 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది. చిట్టగాంగ్ లోనే దీని ప్రభావం ఎక్కువగా కన్పించింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని యూరోపియన్, మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది.


Tags:    

Similar News