మందుబాబులకు బ్యాడ్‌న్యూస్‌.. ఐదు రోజులు మద్యం షాపులు బంద్‌

వైన్స్‌ షాపులు బంద్‌ ఉంటున్నాయంటే చాలు మద్యం బాబుల్లో టెన్షన్‌ మొదలవుతుంది. మద్యం తాగనిదే రోజు గడవని వారు దేశంలో..

Update: 2023-09-03 11:19 GMT

వైన్స్‌ షాపులు బంద్‌ ఉంటున్నాయంటే చాలు మద్యం బాబుల్లో టెన్షన్‌ మొదలవుతుంది. మద్యం తాగనిదే రోజు గడవని వారు దేశంలో ఎందరో ఉన్నారు. ఇక మద్యం షాపులు మూతపడుతున్నాయంటే చాలు ముందస్తుగానే బాటిళ్లకు బాటిళ్లు స్టాక్‌ ఉంచుకుంటారు. అలాంటిది ఐదు రోజుల పాటు మద్యం షాపులు మూసి ఉంటున్నాయని తెలిస్తే ఎలా ఉంటుంది..? ఇంకేముందు ఇంట్లో స్టాక్‌ మందు ఉండాల్సిందే. వైన్స్‌ షాపులు బంద్‌ ఉంటున్నాయంటే మద్యం ప్రియులకు ఎక్కడ లేని కష్టాలు వచ్చినట్లు. తాజాగా ఐదు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. మరి ఎక్కడో అనేగా మీ అనుమానం.. టెన్షన్ పడకండి మన తెలుగు రాష్ట్రాల్లో కానేకాదు. ఢిల్లీలో. వరుసగా ఐదు రోజులపాటు వైన్‌ షాపులు మూసి ఉండనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, జీ20 సమావేశాల సందర్భంగా ప్రభుత్వ సెలవులు ప్రకటించింది. దీంతో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు వైన్‌ షాపులు మూసి ఉండనున్నాయి. హస్తినలో సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 10 వరకు పబ్లిక్‌ సెలవుగా ప్రకటించింది. ఆ మూడు రోజులు మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులతోపాటు మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. దీంతో ఢిల్లీలో మద్యం షాపులు బంద్‌ ఉండనున్నాయి.

ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఈ నెల 6, 7 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరుసగా ఐదు రోజులపాటు వైన్‌ షాపులకు తాళాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో వరుస సెలవుల కారణంగా మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. గత వారం రోజులుగా రాజధానిలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని మద్యం మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా, దానిపై చాలా రాజకీయ ప్రకంపనలు కూడా భారీగానే వచ్చాయి. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబరు 1, 2022 నుంచి ‘పాత మద్యం విధానాన్ని’ అమలు చేసింది. ఇప్పుడు దీని కారణంగా ఆదాయాలు, అమ్మకాలలో కొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2022, ఆగస్టు 31, 2023 మధ్య 61 కోట్లకు పైగా మద్యం బాటిళ్లను విక్రయించింది. మద్యం అమ్మకాల ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి ఏడాదిలో రూ.7,285.15 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిపై ప్రభుత్వం వాల్యూ యాడెడ్ టాక్స్ వసూళ్లు కూడా రూ.2,013.44 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

Tags:    

Similar News