అధీర్ రంజన్ క్షమాపణ
లోక్ సభ కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాశారు.
లోక్ సభ కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఆయన లేఖ రాశారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని ఆయన క్షమాపణ చెప్పారు. గత మూడు రోజులుగా అధీర్ రంజన్ వ్యాఖ్యలతో పార్లమెంటు ఉభయ సభలు స్థంభించిపోతున్నాయి. అప్పటికే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు అధీర్ రంజన్ చెప్పినా అధికార బీజేపీ ఉభయ సభల్లో ఆందోళన చేస్తుంది.
పార్లమెంటు లోపల, బయట...
సోనియా గాంధీ సయితం అధీర్ రంజన్ ఇప్పటికే క్షమాపణ చెప్పారని, ఆందోళన అవసరం లేదని పదే పదే చెప్పారు. అయినా బీజేపీ పార్లమెంటు ఉభయసభల్లో కాకుండా దేశ వ్యాప్త ఆందోళనకు దిగింది. చివరకు అధీర్ రంజన్ క్షమాపణలు చెప్పారు. ప్రత్యేకంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. తాను తొందరపడి చేసిన వ్యాఖ్యలుగా ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.