Loksabha Speaker : 26న స్పీకర్ ఎన్నిక.. ఎన్డీఏ, ఇండియా కూటముల కసరత్తు
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరగనుంది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ వెలువరించింది.
స్పీకర్ పదవి కోసం నామినేషన్లను స్వీకరించే ప్రక్రియను ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ కొనసాగిస్తామని తెలిపింది.అయితే స్పీకర్ పదవి కోసం ఎవరెవరెరు నామినేషన్లు వేయనున్నారన్న దానిపై కొద్దిరోజుల్లోనే స్పష్టత రానుంది.
బలాబలాలు చూస్తే...
అయితే ఈసారి బీజేపీకి తక్కువ స్థానాలు రావడంతో ఎన్డీఏ కూటమిలో స్పీకర్ పదవిపై సహజంగానే పోటీ పెరిగింది. బీహార్ కు చెందిన జేడీయూ, ఏపీకి చెందిన టీడీపీ కూడా స్పీకర్ పదవిని ఆశిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం నార్త్ లో తమకు విశ్వసనీయంగా ఉండే నేతనే స్పీకర్ పదవికి ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి పోటీ పడే అవకాశాలున్నాయంటున్నారు. ఎందుకంటే బలాబలాలు పెద్దగా తేడా లేకపోవడంతో పోటీ అనివార్యమవుతుందని కూడా భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.