Liquor Bottles: రోడ్డుపై మద్యం బాటిళ్లు.. మహిళలు కూడా ఎగబడ్డారు
డెలివరీ వాహనం నుండి కింద పడిన మద్యాన్ని;
ఆగ్రాలోని ఎత్మాద్‌పూర్‌లో డెలివరీ వాహనం నుండి కింద పడిన మద్యాన్ని జనం దోచుకున్నారు. బాటిళ్లను తీసుకుని వెళ్లే అవకాశాన్ని ఎవరూ వదులుకోలేదు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఎగబడి సామూహిక దోపిడీకి పాల్పడ్డారు. మితావాలి గ్రామంలోని ఒక దుకాణానికి 110 బాక్సుల మద్యం రవాణా చేస్తున్న డెలివరీ వాహనం ప్రమాదవశాత్తూ బర్హామ్ రోడ్ సమీపంలో స్పీడ్ గా వెళ్లడంతో వెనకాల డోర్ తెరుచుకుంది. దీంతో 30 పెట్టెలు వీధిలో పడ్డాయి. ఆ పడిపోయిన బాక్సులను ఎంతో వేగంగా బాటసారులు ఖాళీ చేసేశారు.
ఈ దోపిడీకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. విషయం తెలుసుకున్న వాహనం డ్రైవర్ ఘటనా స్థలానికి చేరుకున్నా అప్పటికే చాలా ఆలస్యం అయింది. సీసాలు తీసుకున్న వాళ్లంతా అదృశ్యమయ్యారు. రాజ్‌పూర్ చుంగికి చెందిన సందీప్ యాదవ్ మితావాలి గ్రామంలో మద్యం దుకాణం నడుపుతున్నట్లు వెల్లడించారు. మొత్తం 110 పెట్టెలు రవాణా చేస్తున్నప్పుడు ప్రమాదం కారణంగా 30 పెట్టెలు దారిలో పడ్డాయి. అక్కడే ఉన్న వ్యక్తులు పడిపోయిన పెట్టెలతో పరారీ అయ్యారు.