పన్నీర్ సెల్వంకు షాక్

అన్నాడీఎంకే నాయకత్వం విషయంలో పళనిస్వామికి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది.

Update: 2022-09-02 07:07 GMT

మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురయింది. అన్నాడీఎంకే నాయకత్వం విషయంలో పళనిస్వామికి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ ఏడాది జులై 11వ తేదీన జరిగిన ఏఐఏడీఎంకే జనర్ కౌన్సిల్ సమావేశం చెల్లదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. దీంతో అన్నాడీఎంకే పళనిస్వామి నాయకత్వంలోనే కొనసాగనుంది.

పళనికి అనుకూలంగా...
పన్నీర్ సెల్వం జులై 11న జరిగిన ఎన్నికపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీలో ఏకపక్షంగా నిర్ణయం జరిగిందని, తమ సభ్యులకు ప్రవేశం లేకుండానే సమావేశాన్ని ముగించారని ఆయన పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్ ను జస్టిస్ ఎం దురైస్వామి, జస్టిస్ సుందర్ మోహన్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారించి పళనిస్వామికి అనుకూలంగా తీర్పు నిచ్చింది. దీంతో పళనిస్వామి అన్నాడీఎంకేకు నేతృత్వం వహించనున్నారు.


Tags:    

Similar News