Presence Of Mind: చిరుతను ఇలా కూడా బంధించేయొచ్చా.. పిల్లాడి తెలివి అమోఘం

అడవి జంతువులను చూస్తే చాలు మనకు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది

Update: 2024-03-07 02:16 GMT

అడవి జంతువులను చూస్తే చాలు మనకు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అలాంటిది మీరు ఉన్న రూమ్ లోకి చిరుత వచ్చేస్తే.. వామ్మో ఆ ఊహతోనే కాళ్లు చేతులు ఆడవు అని అంటారా!! అయితే ఓ పిల్లాడు మాత్రం ఎంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. చిరుతపులిని చూడగానే టెన్షన్ పడకుండా.. తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ను పక్కన పెట్టేసి.. రూమ్ డోర్ మూసేసి వచ్చేశాడు. ఆ తర్వాత లోపల చిరుతపులి ఉందంటూ అందరికీ సమాచారం ఇచ్చాడు. ఎలాంటి కష్టాన్నైనా ఇంత కూల్ గా డీల్ చేయొచ్చా అని ఆ పిల్లాడిని చూశాక అందరికీ అనిపిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా.. ఆ పిల్లాడిపై ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి.

మహారాష్ట్రకు చెందిన 12 ఏళ్ల మోహిత్ అహిరే అనే చిన్నారి తన ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ బిజీగా ఉండగా, అదే చిన్న గదిలోకి చిరుతపులి ప్రవేశించింది. పెద్ద పిల్లి ఆ పిల్లవాడిని గమనించకుండా అతనిని దాటి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ పిల్లాడు ఆ రూమ్ లో నుండి బయటకు వెళ్ళిపోయి తలుపు లాక్ చేసాడు. దీంతో చిరుత లోపలే ఉండిపోయింది. ఈ సంఘటన మార్చి 05 న మాలేగావ్‌లో జరిగింది, ఆ సమయంలో పిల్లవాడు పెళ్లి మండపం వద్ద ఉన్నాడు. పిల్లాడు చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించుకున్న వెంటనే గదిలో చిక్కుకున్న చిరుతపులి గురించి తండ్రికి సమాచారం అందించాడు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను వెంటనే పిలిపించారు. 5 సంవత్సరాల వయస్సు ఉన్న పెద్ద పిల్లిని బంధించారు అటవీ అధికారులు.



Tags:    

Similar News