బ్రేకింగ్ : రేపు ఉద్ధవ్ బలపరీక్ష
మహారాష్ట్ర రాజకీయాలు చివరి దశకు చేరుకున్నాయి. బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ కొష్యారీ ఉద్ధవ్ థాక్రే కు లేఖ రాశారు.
మహారాష్ట్ర రాజకీయాలు చివరి దశకు చేరుకున్నాయి. బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ ఉద్ధవ్ థాక్రే కు లేఖ రాశారు. దీంతో రేపు మహారాష్ట్ర శాసనసభలో బలపరీక్ష నిర్వహించనుంది. రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. నిన్న రాత్రి బలపరీక్ష పెట్టాలని ప్రతిపక్ష నేత ఫడ్నవిస్ గవర్నర్ ను కోరారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి త్వరలో తెరదించేందుకు గవర్నర్ రెడీ అయిపోయారు. బలపరీక్ష నిర్వహించేందుకు గవర్నర్ నుంచి ఆదేశాలు రావడంతో అన్ని పార్టీలు రెడీ అయిపోతున్నాయి.
అన్ని పార్టీలూ సిద్ధం...
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ తో కూడి మహా అగాడీ వికాస్ ప్రభుత్వం కూడా తాము బలపరీక్షకు కూడా సిద్ధమవుతుంది. గౌహతి క్యాంప్ లో ఉన్న ఏక్‌నాథ్ షిండే వర్గం రేపు నేరుగా శాసనసభకు చేరుకోనుంది. దాదాపు యాభై మంది సభ్యులున్న షిండే వర్గాన్ని నేరుగా అసెంబ్లీకి తెప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముంబయి అంతా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ముంబయిలో 144వ సెక్షన్ విధించారు.