భార్య అలా ఒత్తిడి చేస్తే భర్త విడాకులు తీసుకోవచ్చు : కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలు

పశ్చిమ మిడ్నపూర్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కలకత్తా హై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.;

Update: 2023-04-10 13:43 GMT
calcutta high court

calcutta high court

  • whatsapp icon

రేపటి తరానికి వివాహం ఒక పునాది. సమాజంలో కుటుంబ జీవనానికి వివాహమే నాంది. కానీ.. ఈ రోజుల్లో వివిధ కారణాలతో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని కేసుల్లో కోర్టు భార్యభర్తులు కొన్నాళ్లు కలిసి ఉండి.. అప్పటికీ విడిపోవాలనుకుంటేనే విడాకులు ఇస్తుంది. అయితే.. తాజాగా భార్యభర్తల విడాకుల విషయంలో కలకత్తా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భర్త తన తల్లిదండ్రులను వదిలేసి రావాలని భార్య ఒత్తిడి చేస్తే విడాకులు తీసుకునే హక్కు భర్తకు ఉంటుందని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.

సరైన కారణం లేకుండా.. భర్త తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేసే భార్య నుంచి విడాకులు పొందాలనుకోవడం తప్పుకాదని స్పష్టం చేసింది. ఓ విడాకుల కేసులో బాధితురాలు పశ్చిమ మిడ్నపూర్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కలకత్తా హై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడడం కుమారుడి పవిత్ర ధర్మం అని, భారతీయ సంస్కృతి, నీతి ప్రకారం కుమారుడు తల్లిదండ్రులతో కలిసి జీవించడం అనేది సాధారణ అంశమని అభిప్రాయపడింది. అయితే కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భర్త తల్లిదండ్రుల నుంచి భార్య వేరు చేయకూడదు అన్నప్పుడు.. భార్యను మాత్రం ఆమె పుట్టింటి నుంచి పెళ్లి పేరుతో శాశ్వతంగా ఎలా విడదీస్తారని మహిళా వాదులు వాపోతున్నారు. ఇద్దరు ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రుల ఆలనా పాలనా ఎవరు చూడాలి ? అని ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News