బాహుబలి సమోసా.. తిన్నవారికి రూ.71 వేలు

అరచేతిలో పట్టేంత సమోసాలు అందరికీ తెలుసు. రెండు తింటేనే కడుపు నిండిపోతుంది. ఉత్తరప్రదేశ్ లోని మీరఠ్ లో శుభం కౌశల్ అనే..

Update: 2023-06-18 13:52 GMT

meerut bahubali samosa

చిరుతిళ్లలో సమోసాది ప్రత్యేక స్థానం. సాయంత్రం వేళ టీ లేదా కాఫీ తాగేముందు.. వేడివేడి సమోసా తింటే ఆ మజా నే వేరు. ఒకప్పుడు ఉల్లి సమోసానే బాగా ఫేమస్. ఇప్పుడు కార్న్ సమోసా, ఆలు సమోసా, చికెన్ సమోసా.. ఇలా రకరకాలుగా సమోసాలను తయారు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ మిఠాయిల దుకాణం యజమాని బాహుబలి సమోసాను తయారు చేశాడు. దీని బరువు 12 కిలోలంట. తిన్నవారికి రూ.71 వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

అరచేతిలో పట్టేంత సమోసాలు అందరికీ తెలుసు. రెండు తింటేనే కడుపు నిండిపోతుంది. ఉత్తరప్రదేశ్ లోని మీరఠ్ లో శుభం కౌశల్ అనే వ్యక్తికి స్వీట్స్ షాప్ ఉంది. తన షాపులో స్నాక్ ఐటమ్ గా చేస్తున్న సమోసాలకు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. అంతే.. 6 గంటల పాటు కష్టపడి 12 కిలోల బరువైన బాహుబలి సమోసాను తయారు చేశాడు. దీనిని నూనెలో వేయించేందుకు గంటననరకు పైగా సమయం పట్టిందట. ముగ్గురు వంటమనుషులు దీనిని తయారు చేసేందుకు శ్రమించారని తెలిపాడు.
ఈ సమోసాను అరగంటలో తిన్నవారికి రూ.71 వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించాడు. తినలేనివారు సమోసా తయారీకి అయిన ఖర్చు రూ.1500 కట్టాలి. గతంలోనూ శుభం కౌశల్ నాలుగు కిలోలు, ఎనిమిది కిలోల భారీ సమోసాలు తయారు చేశాడు. తన రికార్డును తానే బ్రేక్ చేసేలా ఇప్పుడు 12 కిలోల సమోసాను తయారు చేయించాడు. దేశంలో ఇప్పుడిదే భారీ సమోసా అని శుభం కౌశల్ పేర్కొన్నాడు.


Tags:    

Similar News