Union Cabinet : మోదీ కేబినెట్ లో మంత్రులు వీరే
ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ లో మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ లో మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ సీనియర్ నేతలతో పాటు మిత్రపక్షాలకు చెందిన వారికి కూడా మంత్రిపదవులు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రులకు కూడా ఈ సారి కేబినెట్ లో అవకాశం కల్పించారు. కేబినెట్ లో మొత్తం 72 మందికి అవకాశం ఇచ్చారు. వారిలో ముప్ఫయి మంది కేబినెట్ మంత్రులు కాగా, 36మంది సహాయ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలకు చెందిన పార్టీలకు పదకొండు మంత్రి పదవులు ఇచ్చారు. కేబినెట్ లో ఐదుగురు మైనారిటీలున్నారు. 27 మంది ఓబీసీలు, పది మంది ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలున్నారు.
01. రాజ్‌నాధ్ సింగ్ - బీజేపీ
02. అమిత్ షా - బీజేపీ
03. నితిన్ గడ్కరీ - బీజేపీ
04. జయప్రకాష్ నడ్డా - బీజేపీ
05. శివరాజ్ సింగ్ చౌహాన్ - బీజేపీ
06. నిర్మలా సీతారామన్ - బీజేపీ
07. జై శంకర్ - బీజేపీ
08. మనోహర్ లాల్ ఖట్టర్ - బీజేపీ
09. హెచ్.డి. కుమారస్వామి - జేడీఎస్
10. పీయూష్ గోయల్ - బీజేపీ
11, ధర్మేంద్ర ప్రధాన్ - బీజేపీ
12. జితిన్ రామ్ మాంఝి - హెచ్.ఎ.ఎం
13. రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ - బీజేపీ
14. సర్బానంద సోనోవాల్ - బీజేపీ
15. డాక్టర్ వీరేంద్ర కుమార్ - బీజేపీ
16. కింజారపు రామ్మోహన్ నాయుడు - టీడీపీ
17. ప్రహ్లాద్ జోషి - బీజేపీ
18. జువల్ ఓరం - బీజేపీ
19. గిరిరాజ్ సింగ్ - బీజేపీ
20. అశ్వినీ వైష్ణవ్ - బీజేపీ
21. జ్యోతిరాదిత్య సింధియా - బీజేపీ
22. భూపేంద్ర యాదవ్ - బీజేపీ
23. గజేంద్ర సింగ్ షెకావత్ - బీజేపీ
24. అన్నపూర్ణ దేవి - బీజేపీ
25. కిరణ‌్ రిజిజు - బీజేపీ
26. హర్దీప్ సింగ్ పూరి - బీజేపీ
27. మన్సుఖ్ మాండవియా - బీజేపీ
28. జి. కిషన్ రెడ్డి - బీజేపీ
29. చిరాగ్ పాశ్వాన్ - ఎల్.జె.పి
30. సీఆర్ పాటిల్ - బీజేపీ
31. రావు ఇంద్రజిత్ సింగ్ - బీజేపీ
32. డాక్టర్ జితేంద్ర సింగ్ - బీజేపీ
33. అర్జున్ రామ్ మేఘవాల్ - బీజేపీ
34. ప్రతాప్ రావ్ జాదవ్ - శివసేన (షిండే వర్గం)
35. జయంత్ చౌదురి - ఆర్ఎల్‌డీ
36. జితిన్ ప్రసాద్ - బీజేపీ
37. శ్రీపాద నాయక్ - బీజేపీ
38. పంకజ్ చౌదురి - బీజేపీ
39. కృష్ణపాల్ - బీజేపీ
40. రాందాస్ అథవాలే - ఆర్‌పీఐ
41. రామ్‌నాథ్ ఠాకూర్ - జేడీయూ
42. నిత్యానంద్ రాయ్ - బీజేపీ
43. అనుప్రియా పటేల్ - అప్నా దళ్
44. వి. సోమణ్ణ - బీజేపీ
45. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ - టీడీపీ
46. ఎస్.వి. సింగ్ బఘేల్ - బీజేపీ
47. శోభా కరంద్లాజే - బీజేపీ
48. కీర్తి వర్థన్ సింగ్ - బీజేపీ
49. బీఎల్ వర్మ - బీజేపీ
50. శంతను ఠాకూర్ - బీజేపీ
51. సురేష్ గోపి - బీజేపీ
52. ఎల్. మురుగన్ - బీజేపీ
53. అజయ్ తమ్గా - బీజేపీ
54. బండి సంజయ్ కుమార్ - బీజేపీ
55. కమలేష్ పాశ్వాన్ - బీజేపీ
56. భగీరధ్ చౌదురి - బీజేపీ
57. సతీష్ చందర్ దూబె - బీజేపీ
58. సంజయ్ సేథ్ - బీజేపీ
59. రవనీత్ సింగ్ - బీజేపీ
60. సావిత్రి ఠాకూర్ - బీజేపీ