Mpox case బ్రేకింగ్: భారతదేశంలో మంకీపాక్స్ కేసు ధృవీకరణ
ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో
భారతదేశంలో mpox మంకీపాక్స్ కేసు నమోదైనట్లు ప్రభుత్వం ధృవీకరించింది. అయితే ప్రపంచ దేశాల్లో నమోదైన మంకీ పాక్స్ కేసుతో పోల్చుకుంటే ఇది విభిన్నంగా ఉందని తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన జాతికి భిన్నమైనదని భారత ప్రభుత్వం పేర్కొంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. అనుమానం ఉన్న Mpox (మంకీపాక్స్) కేసు ప్రయాణ సంబంధిత సంక్రమణగా ధృవీకరించామని తెలిపింది. సంబంధిత పరీక్షాల్లో రోగిలో పశ్చిమ ఆఫ్రికా క్లాడ్ 2 Mpox వైరస్ ఉనికిని నిర్ధారించింది. ఈ కేసు భారతదేశంలో జూలై 2022 నుండి ఇంతకు ముందు నమోదైన 30 కేసుల మాదిరిగానే ఉందని తెలిపింది ప్రభుత్వం. mpox క్లాడ్ 1కి సంబంధించినది కాదని మంత్రిత్వ శాఖ తెలిపింది. mpox వైరస్ సోకిన వ్యక్తి ప్రస్తుతం నిలకడగా ఉన్నాడని, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం లేదని ప్రకటన పేర్కొంది.