వర్గీకరణ తీర్పుపై మందకృష్ణ ఏమన్నారంటే?

ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు

Update: 2024-08-01 06:33 GMT

ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఇది మాదిగ కులాలకు శుభదినం అని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ పోరాటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అనేక మంది తమకు సహకరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఆయన కోరారు. ఎస్సీలందరం కలసి దళిత సమస్యలపై పోరాటం చేద్దామని ఆయన పిలుపు నిచ్చారు. వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని ఆయన అన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లను...
ఇప్పటి వరకూ జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లను నిలుపుదల చేసి ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారని తాము భావిస్తున్నామని అన్నారు. నాడు చంద్రబాబు నాయుడే ఎస్సీ వర్గీకరణను అమలు చేశారని, ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆయన ఖచ్చితంగా అమలు చేస్తారని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ రేవంత్ రెడ్డి రిజర్వేషన్లలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. తమ పోరాటానికి సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


Tags:    

Similar News