వావ్.. ఈ కారు.. అంబానీదే.. ఖరీదెంతో తెలుసా?
మోజుపడిన కారును చాలా రోజుల తర్వాత ముఖేష్ అంబానీ కొనుగోలు చేశారు. దీని ఖరీదు 13.14 కోట్లు అని చెబుతున్నారు.
అతి ఖరీదైన కారు. సకల సౌకర్యాలు. భారత్ లోనే అత్యంత ఖరీదైన కారు ఎక్కడుందని అనుకుంటున్నారా? ఇంకెక్కడ ఉంటుంది? ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ దగ్గరే. ఆయనకు కార్ల కొరత లేదు. పదుల సంఖ్యలో అతి ఖరీదైన కార్లు ఉన్నాయి. కానీ ఆయన మోజుపడిన కారును చాలా రోజుల తర్వాత ముఖేష్ అంబానీ కొనుగోలు చేశారు. దీని ఖరీదు 13.14 కోట్లు అని చెబుతున్నారు.
రోల్స్ రాయిస్....
దీనిని ప్రముఖ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తయారు చేసింది. అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ హ్యాచ్ బ్యాక్ కారు అని చెబుతున్నారు. ఇది పెట్రోల్ మోడల్. దీనిని ముంబయిలోని ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. రిలయన్స్ ఇండ్రస్ట్రీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. గత నెల 31వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించారు. 2018లో లాంచ్ చేసిన కారును విదేశాల నుంచి తెప్పించారు. ఇందుకోసం ఇరవై లక్షల ట్యాక్స్ అంబానీ కంపెనీ చెల్లించేసింది.
13 కోట్లు వెచ్చించి....
రోడ్డు ట్యాక్స్ కింద అదనంగా ఈ కారుకు నలభై వేలు చెల్లించారు. అనిల్ అంబానీ ఒకటో నెంబర్ ను లక్కీగా భావిస్తారు. దీంతో ఈ కారు కోసం 0001 నెంబరును ఆక్షన్ లో దక్కించుకున్నారు. కొత్త సిరీస్ తో ఇవ్వడంతో ఇంత ఖర్చయింది. ఇందుకోసం 12 లక్షలు ఖర్చు చేశారని చెబుతున్నారు. భారత్ లో అత్యంత ఖరీదైన కారుగా దీనిని చెబుతున్నారు. ఈ కారును చూసి ఆర్టీఏ అధికారులు కూడా నోళ్లు వెళ్లబెట్టారు.