రేపు రంజాన్ పండగ

రంజాన్ పండగ శనివారం జరుపుకుంటారని ముస్లిం మత పెద్దలు ఒక ప్రకటనలో తెలియజేశారు;

Update: 2023-04-21 02:32 GMT
ramadan, saturday, hyderabad
  • whatsapp icon

రంజాన్ పండగ భారత్ లో శనివారం జరగనుంది. నిన్న సౌదీలో నెలవంక కనిపించడంతో శుక్రవారం గల్ఫ్ దేశాల్లో రంజాన్ పండగ జరుపుకుంటున్నారు. కానీ ఇండియాలో మాత్రం శనివారం రోజు జరుపుకుంటారని ముస్లిం మత పెద్దలు ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఈ పండగ కోసం...
ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్ పండగ కోసం ఎదురు చూస్తుంటారు. ఏడాదిలో నలభై రోజులకు పైగా ఉపవాసాలు ఉండి, ప్రత్యేక ప్రార్థనలు చేసి రంజాన్ రోజు పండగ చేసుకోవడం సంప్రదాయంగా వస్తుంది. శనివారం హైదరాబాద్‌లో అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.


Tags:    

Similar News