Gyanvapi : జ్ఞానవాపి వివాదంలో తీర్పు
జ్ఞానవాపి వివాదంలో ముస్లింలకు షాక్ తగిలంది. అలహాబాద్ హైకోర్టు ముస్లింలకు వ్యతిరేకంగా తీర్పు జెప్పింది
జ్ఞానవాపి వివాదంలో ముస్లింలకు షాక్ తగిలంది. అలహాబాద్ హైకోర్టు ముస్లింలకు వ్యతిరేకంగా తీర్పు జెప్పింది. జ్ఞానవాపి మసీదు స్థంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న సివిల్ దావాపై అలహాబాద్ కోర్టు నేడు తీర్పు చెప్పింది. ఈ వ్యాజ్యాన్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటీషన్లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.
ఈ నెల 21వ తేదీకి...
దిగువ కోర్టులో విచారణను వేగవతం చేసి ఆరునెలల్లోగా ముగించాలని అలహాబాద్ హైకోర్టు కింది కోర్టును ఆదేశించింది. తదుపరి విచారనను డిసెంబరు 21వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ అవసరమని భావిస్తే దిగువ కోర్టు ఏఎన్ఐని ఆదేశించవచ్చని పేర్కొంది. అదనపు సర్వే అని కోర్టు పేర్కొంది. అలహాబాద్ కోర్టు తీర్పుతో ముస్లిం వర్గాలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది.