JP Nadda:రాజీనామా చేసిన జేపీ నడ్డా.. ఎందుకో తెలుసా?
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
JP Nadda:భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం నాడు ఆయన హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత.. నడ్డా తన హిమాచల్ ప్రదేశ్ స్థానానికి రాజీనామా చేసినట్లు అధికారులు తెలిపారు. నడ్డా రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. నడ్డా 2014 నుంచి 2019 వరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2020 జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ తో దేశంలోని 57 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఆ నాయకుల్లో జేపీ నడ్డా కూడా ఉన్నారు. ఇక రాజ్యసభ ఎన్నికల్లో ఆయన గుజరాత్ నుంచి ఏకగ్రీవంగా ఇటీవల ఎన్నికయ్యారు. గుజరాత్ నుంచి నడ్డాతో పాటు గోవింద్ భాయ్ డోలాకియా, జస్వంత్ సింగ్ పర్మార్, మయాంక్ నాయక్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంతో జేపీ నడ్డా మళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.