హైవేపై వెళుతున్నారా? అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే మరి

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చింది

Update: 2024-07-19 06:10 GMT

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా వాహనం విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్ లను వాహనం విండ్‌షీల్డ్‌పై బిగించడం లేదని, ఈ తరహా వాహనదారుల కారణంగా టోల్‌ గేట్ల వద్ద చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తి, అంతరాయం ఏర్పడుతోందని పేర్కొంది.

వారిని దారిలో పెట్టేందుకే...
ఇలాంటి వాహనదారులను దారిలో పెట్టడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్తగా సంపూర్ణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌ను బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్ బిగించకపోవడంతో టోల్ ప్లాజాల వద్ద అనవసరమైన జాప్యాలు జరుగుతున్నాయని, ఇతర వాహనదారులు అసౌకర్యానికి గురయ్యేందుకు దారితీస్తాయని పేర్కొంది.


Tags:    

Similar News