Exit Polls : మళ్లీ అధికారం ఎన్డీఏదే .. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్

కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. ఎన్డీఏ కూటమి దేశంలో అధికారంలోకి వస్తుందని తేల్చాయి.

Update: 2024-06-01 13:19 GMT

కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. ఎన్డీఏ కూటమి దేశంలో అధికారంలోకి వస్తుందని తేల్చాయి. డీఎంకే 20 నుంచి 22 స్థానాలు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. తమిళనాడులో 39 స్థానాలకు ఇండియా కూటమికి 33నుంచి 37 స్తానాలు వస్తాయని తెేల్చింది. ఎన్డీఏ రెండు నుంచి నాలుగు స్థానాలు వస్తాయని తేల్చింది. కర్ణాకటలో ఎన్డీఏ లో 20 నుంచి ఇరవై నాలుగు స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తాయని తెలిపింది. జేడీఎస్ కు ఒకటి లేదా రెండు స్థానాలు వస్తాయని తెలిపింది. ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ కు రిపబ్లిక్ టీవీ ఎన్డీఏ 359 సీట్లు వస్తాయని తెలిపింది. 154 స్థానాలలో ఇండియా కూటమి పరిమితమవుతుందని తేల్చింది.

తెలంగాణలో ఆరా సంస్థ లెక్కలివీ...
ఆరా సంస్థ సంస్థ తెలంగాణలో బీజేపీ ఎనిమిది నుంచి తొమ్మిది, కాంగ్రెస్ ఏడు నుంచి ఎనిమిది, ఎంఐఎం ఒక స్థానం, బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదని తెలిపింది. ఆరా సంస్థ అంచనాల ప్రకారం బీఆర్ఎస్ కు ఒక్కస్థానం కూడా దక్కలేదు. తెలంగాణలో బీజేపీకే అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేసింది.


Tags:    

Similar News