భయపెట్టిస్తున్న 'నిపా'వైరస్.. మరో కేసు.. ఐసీఎంఆర్ ఏం చెబుతోంది
ఇన్నాళ్లు కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అయ్యింది. దాని తర్వాత కొత్త కొత్త వేరియట్లు పుట్టుకొచ్చి..
ఇన్నాళ్లు కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అయ్యింది. దాని తర్వాత కొత్త కొత్త వేరియట్లు పుట్టుకొచ్చి భయభ్రాంతులకు గురి చేశాయి. ఇప్పుడు తాజాగా కేరళలో వ్యాపిస్తున్న నిపావైరస్ మరోమారు జనాలను వణికిస్తోంది. కేరళలో ఇప్పటకే ఐదు కేసులు నమోదు కాగా, ఇప్పుడు మరో నిపా వైరస్ కేసు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. కేరళలో ఈ వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. తాజాగా కోజికోడ్‌లో 39 ఏళ్ల వ్యక్తికి ఈ నిపా వైరస్ సోకినట్లు గుర్తించారు వైద్యాధికారులు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నాలుగుకు పెరిగాయి. కేరళలో ఇప్పటి వరకు మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు చనిపోయారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ఫెక్షన్‌ను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నిపా వైస్ సోకడంతో గ్రామ పంచాయతీలో కోజికోడ్‌ను క్వారంటైన్ జోన్‌గా ప్రకటించారు.
213 మంది హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు:
నిపా వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఎలా ఉంటాయి..?
➦ వ్యాధి సోకిన వారికి, ప్రారంభ లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, మెదడువాపు, మూర్ఛలు
➦ ఈ వైరస్‌కు సరైన చికిత్స, వ్యాక్సీన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడం వలన వైరస్ సోకిన వారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. లక్షణాలు గుర్తించిన తర్వాత చికిత్స అందించాలి.