Bihar : నేడు నితీష్ బలపరీక్ష
బీహార్‌లో నేడు నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొననుంది
Nitish kumar, bihar politics: బీహార్‌లో నేడు నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొననుంది. ఈరోజు జరిగే విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గుతుందా? లేదా? అన్నది తేలనుంది. ఆర్జేడీతో కూడిన మహాకూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమిలో చేరారు.
క్యాంప్ నుంచి...
తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడిన పథ్నాలుగు రోజుల తర్వాత నితీష్ కుమార్ బలపరీక్షను ఎదుర్కొననున్నారు. అయితే బీజేపీ మద్దతు ఉండటంతో నితీష్ సర్కార్ విశ్వాస పరీక్షలో గట్టెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహాకూటమి లోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు తమ సభ్యులను క్యాంప్‌లకు తరలించి ఈరోజు బలపరీక్ష ఉండటంతో నేరుగా అసెంబ్లీకి తరలించే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.