బలపరీక్షలో గట్టెక్కిన నితీష్ సర్కార్

బీహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. బేజేపీ సభ్యులు వాకౌట్ చేయడంతో సులువుగా నెగ్గింది

Update: 2022-08-24 12:09 GMT

బీహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. బేజేపీ సభ్యులు వాకౌట్ చేయడంతో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. దీంతో ఆర్జేడీ, జేడీయూ ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోయింది. ముందుగానే స్పీకర్ కూడా రాజీనామా చేయడంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా నితీష్ కుమార్ ప్రభుత్వం గట్టెక్కింది.

ఐదేళ్ల నుంచి ఏం చేశారు?
2015లో తన వల్లనే బీజేపీ గెలిచిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. వాజపేయి, అద్వానీలు తన మాట వినేవాళ్లని, అయితే ఇప్పుడు బీజేపీలో అలాంటి పరిస్థితులు లేవని ఆయన తెలిపారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేకుండా పోయిందన్నారు నితీష్ కుమార్. 2017లో తేజస్వి యాదవ్ పై అవినీతి ఆరోపణలు చేశారని ఇంతవరకూ ఎందుకు నిరూపించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలది ప్రచారం ఎక్కువ, పని తక్కువ అని ఆయన అన్నారు.


Tags:    

Similar News