మళ్లీ పెరిగిన పెట్రోలు ధరలు

చమురు సంస్థలు రోజు పెట్రోలు ధరలను పెంచుతూనే పోతున్నాయి. వినియోగదారులపై భారం మోపుతున్నాయి;

Update: 2022-03-28 03:35 GMT

చమురు సంస్థలు రోజు పెట్రోలు ధరలను పెంచుతూనే పోతున్నాయి. వినియోగదారులపై భారం మోపుతున్నాయి. వరసగా ఆరో రోజు కూడా చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి. లీటరు పెట్రోలు పై 30 పైసలు, లీటరు డీజిల్ పై 35 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 112.71 రూపాయలు, లీటరు డీజిల్ ధర 99.08 రూపాయలుగా ఉంది.

ఆరోసారి.....
పెట్రో ఉత్పత్తుల ధరలను రోజూ పెంచుతూ పోతుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆరు రోజుల్లోనే దాదాపు నాలుగు రూపాయల భారాన్ని లీటరకు మోపారు. ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడనుంది. వారం రోజుల్లో ఆరుసార్లు చమురు సంస్థలు పెట్రోలు ధరలు పెంచాయి.


Tags:    

Similar News