తగ్గిన గ్యాస్ సిలెండర్ ధర.. వారికి మాత్రమే
ఎల్‌పీజీ గ్యాస్ ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచి తగ్గిన ధరలు అమలులోకి రానున్నాయి
ఎల్‌పీజీ గ్యాస్ ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచి తగ్గిన ధరలు అమలులోకి రానున్నాయి. వాణిజ్య సిలిండర్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 25.5 రూపాయలు తగ్గింది. వివిధ నగరాల్లో వేర్వేరు రకాలుగా ధరలు తగ్గాయి. ప్రతి నెల చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలపై సమీక్ష చేస్తుంటాయి.
తగ్గిన రేట్లు తక్షణమే...
తగ్గిన రేట్లు తక్షణం అమలులోకి రానున్నాయని చమురు సంస్థలు ప్రకటించాయి. ప్రతి నెల మొదటి తేదీన ఈ ధరలను చమురు సంస్థలు సమీక్షిస్తాయి. గత నెలలో ఈ సిలిండర్ ధరను 91.50 రూపాయలు తగ్గించింది. అయితే గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి.