Gas Cylinder : గుడ్ న్యూస్... సిలిండర్ ధరలు దిగి వచ్చాయ్

గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

Update: 2024-04-01 05:20 GMT

గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెల ఒకటోతేదీన గ్యాస్, పెట్రోల్ పై సమీక్షించి ధరలపై చమురు సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. ఇందులో భాగంగా ఈరోజు ఏప్రిల్ ఒకటోతేదీ కావడంతో గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలపైనే తగ్గించింది. దీనిపై 30.50 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐదుకేజీల ఎఫ్.టీ.ఎల్ గ్యాస్ సిలిండర్ ధరపై 7.50 రూపాయలు తగ్గించింది.

నేటి నుంచే అమలు...
పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయిని చమురుసంస్థలు తెలిపాయి. గృహాలకు వినియోగించే సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేవలం కమర్షియల్ గా వినియోగించుకునే సిలిండర్లపైనే ధరలను చమురు సంస్థలు తగ్గించాయి. అయితే వీటి ధర తగ్గడంతో కొంత చిరు వ్యాపారులకు మేలు చేకూరుతుందని భావిస్తున్నారు. ఇటీవల గృహాలకు వినియోగించే సిలిండర్ల ధరపై వందరూపాయలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News