పెరిగిన వంట గ్యాస్ ధరలు
చమురు సంస్థలు వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెంచాయి. వినియోగదారులపై భారాన్ని మోపాయి;
చమురు సంస్థలు వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెంచాయి. వినియోగదారులపై భారాన్ని మోపాయి. 14.2 కేజే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరపై యాభై రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను 350.50 రూపాయలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికలు ముగియగానే...
నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తుంది. ప్రస్తుతం పెరిగిన ధరలతో తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర 11,55 రూపాయలకు చేరుకుంది. గ్యాస్ ధరల పెరుగుదలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.