ఒక్కరోజే ఇన్ని కేసులో.. భారత్ ఒమిక్రాన్

దేశంలో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్ లో 21 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది.;

Update: 2021-12-25 12:26 GMT

దేశంలో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్ లో 21 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. రాజస్థాన్ లో మొత్తం కేసులు 43కు చేరుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలోని పది హేడు రాష్ట్రాల్లో నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారు కొందరైతే, వారితో కాంటాక్టు అయిన వారు మరికొందరితో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.

500 కు చేరువలో....
దీంతో భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 437 కు చేరుకుంది. భారత్ లో నమోదయిన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 79, గుజరాత్ 43, తెలంగాణలో 38 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో ఆంక్షలను విధించారు. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.


Tags:    

Similar News