మళ్లీ లాక్ డౌన్ తప్పదా?
దేశంలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో దేశంలో రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది
దేశంలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. జనవరి మొదటి వారంలో రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందున్న దానిపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరపుతుంది.
రెండు రోజుల పాటు...
ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో లాక్ డౌన్ విధిస్తే కొంత కేసులు తగ్గుముఖం పడతాయని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే లాక్ డౌన్ విధించడం మంచిదా? లేక కఠిన ఆంక్షలు విధించడం మంచిదా? అన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు లాక్ డౌన్ విధిస్తేనే బెటర్ అన్న సూచనలు వినిపిస్తున్నాయి.