భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

భారత్ ను ఒమిక్రాన్ వణికిస్తుంది. ప. ప్రస్తుతం భారత్ లో 415 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.;

Update: 2021-12-25 04:33 GMT

భారత్ ను ఒమిక్రాన్ వణికిస్తుంది. పదుల సంఖ్యలో ప్రతిరోజూ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో 415 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమై అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. టెస్ట్ ల సంఖ్యను మరింత పెంచాలని సూచించింది. కోవిడ్ నిబంధనలను కఠిన తరం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఆంక్షలు కఠినతరం....
దీంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 144వ సెక్షన్ విధించారు. ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఎటువంటి సామూహిక కార్యక్రమాలను నిర్వహించవద్దని కోరింది. అనేక రాష్ట్రాలు అదే దిశగా ఆంక్షలు విధిస్తున్నాయి.


Tags:    

Similar News