భారత్ ను ఒణికిస్తున్న ఒమిక్రాన్.. పెరిగిన కేసులు
భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులుపెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో మొత్తం 653 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి;
భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో మొత్తం 653 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 23 రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా పుదుచ్చేరిలోనూ రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రాలను అప్రమత్తం.....
ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా 167 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత ఢిల్లీలో 165 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 62 కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.