భారత్ లో భారీగా ఒమిక్రాన్ కేసులు

ఒమిక్రాన్ వేరియంట్ భారత్ ను భయపెడుతోంది. నెల రోజులు తిరగక ముందే భారత్ లో ఒమిక్రాన్ కేసులు 1,201 కు చేరుకున్నాయి.

Update: 2021-12-31 02:25 GMT

ఊహించినట్లే ఒమిక్రాన్ వేరియంట్ భారత్ ను భయపెడుతోంది. నెల రోజులు తిరగక ముందే భారత్ లో ఒమిక్రాన్ కేసులు 1,201 కు చేరుకున్నాయి. దాదాపు 25 రాష్ట్రాలకు ఒమిక్రాన్ విస్తరించింది. అయితే ఒమిక్రాన్ కారణంగా మరణించిన తొలి కేసు మహారాష్ట్రలో నమోదయింది. భారత్ లో ఒక్కరోజులోనే 198 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 52 ఏళ్ల ఒక వ్యక్తి ఒమిక్రాన్ కు చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు.

కొన్ని రాష్ట్రాలకు....
‌ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆంక్షలను కఠినతరం చేయాలని సూచించింది. కానీ జార్భండ్, ఛత్తీస్ ఘడ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పరీక్షలు చేయాలని నిర్ణయించాయి.


Tags:    

Similar News