కండక్టర్ అవతారమెత్తనున్న ముఖ్యమంత్రి
రేపటి నుంచి అమలు కానుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం సిద్ధరామయ్య స్వయంగా బస్సు ఎక్కి..
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ప్రకటించిన పథకాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి. వాటిలో ఒకటి శక్తి. ఈ పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. జూన్ 11 నుంచి ఈ పథకం ప్రాంరంభం కానుంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే కండక్టర్ అవతారం ఎత్తనున్నారు.
కర్ణాటకలో తొలి ప్రాజెక్టు మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి.. రేపటి నుంచి అమలు కానుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం సిద్ధరామయ్య స్వయంగా బస్సు ఎక్కి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. స్వయంగా కండక్టర్ గా ఉంటూ మహిళా ప్రయాణికులకు శక్తి యోజన స్మార్ట్‌కార్డును పంపిణీ చేస్తానని సిద్ధరామయ్య తెలిపారు. శక్తి యోజనను ప్రత్యేక రూపంలో ప్రారంభించాలని సిద్ధరామయ్య ప్రతిపాదించారు. బీఎంటీసీ బస్సులో టిక్కెట్ల పంపిణీ ద్వారా శక్తి యోజనను సీఎం ప్రారంభించనున్నారు. రూట్ నంబర్ 43 బస్సులో సిద్ధరామయ్య కండక్టర్ గా టికెట్లు అందించనున్నారు.
జూన్ 11న శక్తి యోజనను ప్రత్యేక రూపంలో ప్రారంభించాలని సిద్ధరామయ్య ప్రతిపాదించారు. స్వయంగా బస్ కండక్టర్ గా మహిళలకు ఉచితంగా టిక్కెట్లు పంపిణీ చేస్తానన్నారు. బీఎంటీసీ బస్సులో టిక్కెట్ల పంపిణీ ద్వారా శక్తి యోజనను సీఎం ప్రారంభించనున్నారు.