గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయిగా

దీపావళి మరుసటి రోజున గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి

Update: 2024-11-01 06:51 GMT

దీపావళి మరుసటి రోజున గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతినెల ఒకటోతేదీన ఆయిల్ సంస్థలు పెట్రో ఉత్పత్తులపై ధరలను సమీక్ష చేస్తుంటాయి. అలాగే ఈరోజు నవంబరు 1వ తేదీ కావడంతో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

వాణిజ్య సిలిండర్ ధరలను...
అయితే వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క సిలిండర్ ధరపై అరవై ఒక్కరూపాయలు పెంచింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను అరవై ఒక్క రూపాయలు పెంచడంతో చిరు వ్యాపారులు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచడంతో ఆ భారం వినియోగదారులపై పడుతుంది. గ్యాస్ ధరలు పెంచడంతో వినియోగదారులపై మరో భారం పడుతుంది.


Tags:    

Similar News