నేటితో ఆపరేషన్ గంగ పూర్తి

నేటితో ఆపరేషన్ గంగ పూర్తి కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు ఉక్రెయిన్ నుంచి చివరి విమానాలు రానున్నాయి.;

Update: 2022-03-10 01:58 GMT
ukriane war, russia, operation ganga, india
  • whatsapp icon

నేటితో ఆపరేషన్ గంగ పూర్తి కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు ఉక్రెయిన్ నుంచి చివరి విమానాలు రానున్నాయి. రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమవ్వడంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఆపరేషన్ గంగ పేరిట మిషన్ ను ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లి భారతీయులను వెనక్కు రప్పించేందుకు ప్రయత్నించారు.

చివరి విమానాలు....
అయితే ఇప్పటికే ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడం పూర్తయిందని కేంద్ర విదేశాంగ అధికారులు చెబుతున్నారు. సుమీలో చిక్కుకున్న 694 మంది భారతీయ విద్యార్థులను పోలండ్ కు తరలించారు. ఉక్రెయిన్ పొరుగుదేశాల నుంచి ఈరోజు ఇండియాకు చివరి విమానాలు రానున్నాయి. నేటితో ఆపరేషన్ గంగ కార్యక్రమం పూర్తయినట్లు ప్రకటించింది.


Tags:    

Similar News