పళనిస్వామికే పగ్గాలు
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి బాధ్యతలను చేప్టటారు.
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి బాధ్యతలను చేప్టటారు. పూర్తి స్థాయి పదవి కోసం నాలుగు నెలల తర్వాత ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించారు. అన్నాడీఎంకేలో మొన్నటి వరకూ పార్టీ కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పదవులు ఉండేవి. అయితే వాటిని రద్దు చేస్తూ జయలలిత హయాంలో ఉన్నట్లుగానే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించారు. తాత్కాలికంగా పళనిస్వామి ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు.
నాలుగు నెలల తర్వాత...
పళని స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వం ఉన్న వారే ఓటేసేందుకు అర్హులు. ఈ పదవి కోసం పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు పోటీ పడ్డారు. పన్నీర్ సెల్వం శశికళకు దగ్గరవుతున్నారని పళని వర్గం ఆరోపిస్తుంది. దీనిపై పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు పన్నీర్ పిటీషన్ కొట్టివేసి సమావేశాలను యధాతధంగా జరుపుకోవాలని ఆదేశించింది. ఈరోజు జరిగిన సమావేశంలో పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి.