Lunar Eclipse : చంద్రగ్రహణం అంటే ఏంటి? ఆరోజు అలాంటి పనులు చేయకూడదా?
ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహణం. ఆరోజు దేశంలోని ఆలయాలన్నీ మూసివేస్తారు
ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహణం. ఆరోజు దేశంలోని ఆలయాలన్నీ మూసివేస్తారు. భారత్ నుంచి నేేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ వంటి దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపించనుంది. రేపు ఏర్పడబోయేది పాక్షిక చంద్రగ్రహణమే. భారత కాలమానం ప్రకారం ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1.05 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. 2.24 గంటలకు ముగియనుంది. దాదాపు గంట ఇరవై నిమిషాలు పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. ఖగోళంలో జరిగే అద్భుతంగా శాస్త్రవేత్తలు చెబుతారు.
వీడియో చంద్రగ్రహణం అంటే ఏంటి?
చెడు సమయంగా...
అదే పురాణాల్లో దీనిని చెడుగా భావిస్తారు. చంద్రగ్రహణ సమయంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏవీ తినకూడదు. గర్భిణులు చూడకూడదంటారు. అశుభ ఘడియలుగా భావించడం వల్లనే ఆలయాలన్నీ మూతబడతాయి. గ్రహణం వీడిన తర్వాత స్నానం చేయాలంటారు. ఇంటిని పూర్తిగా శుభ్రపర్చుకోవాలని చెబుతారు. కానీ అవి పురోహితులు చెప్పే మాటలు. కానీ శాస్త్ర వేత్తలు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు.
శాస్త్రవేత్తలు మాత్రం...
శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం చంద్రుడు, సూర్యుడు మధ్యలోకి భూమి అడ్డురావడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి మధ్యలో ఉంటుంది కావున సూర్యకిరణాలు చంద్రుడిపై పడవని శాస్త్రవేత్తలు చెబుతారు. పాక్షిక చంద్రగ్రహణం భారత్ లోని అన్ని ప్రాంతాల్లో కనపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రత్యేకంగా టెలిస్కోపులు లేకుండా చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చని చెబుతున్నారు.
ఆలయాలన్నీ...
ఈ నెల 28 మధ్యాహ్నం నుంచి తిరుమల ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. తిరుమల, శ్రీశైలంతో పాటు అన్ని దేవాలయాలు మూతబడనున్నాయి. 29వ తేదీ ఉదయం వరకూ ఆలయాల తలుపులు తెరుచుకోవు. భక్తులకు దర్శనం ఉండదు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే చంద్రగ్రహణం గురించి ప్రచారం చేస్తున్నాయి ఆలయ కమిటీలు. పాక్షిక చంద్ర్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటలు ముందుగా సూతకాలంగా పూర్వీకులు పరిగణిస్తారు.