మూడో రోజులుగా వేట
గత మూడు రోజులుగా పంజాబ్ పోలీసులు ఖలిస్థానీ అనుకూల 'వారీస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు
గత మూడు రోజులుగా పంజాబ్ పోలీసులు ఖలిస్థానీ అనుకూల 'వారీస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్ మొత్తం ఇంటర్నెట్ ను బంద్ చేశారు. ఈ మధ్యాహ్నం వరకూ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవని పోలీసులు తెలిపారు. పంజాబ్ మొత్తం హై అలెర్ట్ ప్రకటించారు. గత కొద్ది రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ అమృత్‌పాల్ సింగ్ తప్పించుకు తిరుగుతున్నాడు.
ఇంటర్నెట్ సేవలు బంద్...
అమృత్‌సర్‌లోని జల్లుపుర్ ఖేరాలో అమృత్‌పాల్ సింగ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేత ఉండగా దాన్ని సోమవారం మధ్యాహ్నం వరకు పొడగిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకింగ్, వైద్యం, ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను నిలిపివేయడం లేదని పోలీసు శాఖ పేర్కొంది. త్వరలో అమృత్‌పాల్ సింగ్ ని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.