దీపావళికి ఖరీదైన కార్ల గిఫ్ట్.. కంపెనీ యజమాని ఉదారత
దీపావళికి హర్యానాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ తమ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది.
దీపావళికి భారీగా బహుమతులు ఇవ్వడం కంపెనీలు చేస్తుంటాయి. స్వీట్ బాక్స్ ల నుంచి మొదలు పెడితే అనేక సంస్థలు తమ ఉద్యోగులకు ఏదో ఒక గిఫ్ట్‌లను అందచేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కొందరు కంపెనీ యజమానులు మాత్రం తమకు వచ్చిన లాభాలను ఉద్యోగులకు పంచిపెట్టడంలో ఏ మాత్రం వెనుకాడరు. వారికి డబ్బు రూపంలో కాకుండా తమ ఉద్యోగులు హుందాగా ఉండాలని కోరుకుంటూ వారికి కార్లను బహుమతిని ఇవ్వడం ఇటీవల కాలంలో ఎక్కువయింది.
పదిహేను మందికి...
తాజాగా దీపావళికి హర్యానాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ తమ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది. పంచకులలో ఉన్న కంపెనీ యజమాని భాటియా ఉద్యోగులు పదిహేను మందికి దీపావళి కానుకగా ఖరీదైన కార్లను అందచేశారు. టాటా పంచ్ తో పాటు, మారుతి గ్రాండ్ విటారా కార్లను బహుమతిగా అందచేసి తన ఉదారతను చాటుకున్నార. ఈ నెల 14వ తేదీన ఈ కానుకలను ఉద్యోగులకు అందించారు. వీరంతా అత్యుత్తమ పనితీరు కనపర్చడంతో వారికి ఖరీదైన కార్లను గిఫ్ట్ గా ఆయన ఇవ్వడం ఆయన ఉదారతను చాటి చెప్పింది. మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. కార్లను కంపెనీ అవసరాలకు వినియోగిస్తే దాని పెట్రోలు ఖర్చు కూడా కంపెనీ భరించనుంది.