కృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్
ప్రధాని నరేంద్ర మోదీ కృష్ణ మరణంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో..;
ఆకాశంలో ఒక తార ధృవతారైంది. సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసం వద్ద ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. మహేష్ బాబును పరామర్శిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కృష్ణ మరణంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో మహేష్ కువారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. అని ట్వీట్ చేశారు.
అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృష్ణ మృతిపై స్పందించారు. కృష్ణగారి చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. వ్యక్తిగత జీవితంలో ఒందికగా ఉంటూ.. వృత్తికి ఆయనిచ్చే విలువ.. ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. కృష్ణ మృతిపట్ల సంతాపం తెలుపుతూ.. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.